మెహర్ రమేష్( Meher Ramesh )… ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.ఎన్ని మంచి అవకాశాలు వచ్చిన ప్రతిసారి తన డిజాస్టర్ ఫలితాలను ప్రేక్షకులకు అందిస్తున్న దర్శకుడుగా మెహర్ రమేష్ కి పేరు వస్తుంది.
నిన్నటికి నిన్న చిరంజీవితో( Chiranjeevi ) బోలా శంకర్ అనే సినిమా విడుదల చేసి మెగా అభిమానులను డిసప్పాయింట్ చేయడంలో మెహర్ రమేష్ సక్సెస్ అయ్యాడు.ఇప్పటి వరకు రమేష్ చేసిన అనేక సినిమాలు ఇదే దోవలో ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి.
తొలుత కన్నడ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మెహర్ రమేష్ ఆ తర్వాత క్రాంతి, శక్తి, షాడో వంటి అట్టర్ ఫ్లాప్ సినిమాలు తీశాడు ఇక అప్పటి నుంచి సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు.

చిరంజీవికి కజిన్ అవుతాడు అనే ఒక కారణంతో ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ( Mega Family ) అతడిని భరిస్తూ వచ్చింది.అయినా కూడా ఏదో ఒక నమ్మకం మెహర్ రమేష్ కి సినిమా అవకాశం ఇచ్చేలా చేసింది కానీ వచ్చిన ఆ అవకాశాన్ని కూడా పూర్తిగా నాశనం చేసుకున్నాడు ఇకపై సినిమా ఇండస్ట్రీలో మెహర్ రమేష్ నీ నమ్మి ఎవరు సినిమా ఇస్తారు అనేది ప్రశ్నార్థకమే.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా తీయడం అంటే కత్తి మీద సాము చేయడం అని అందరికీ తెలుసు.
ఇలాంటి స్థితిలో కూడా చిరంజీవి మెహర్ రమేష్ ని నమ్మి సినిమా ఇచ్చాడు.ఒకవేళ కనుక సినిమా విజయం సాధించి ఉండి ఉంటే మెహర్ రమేష్ చేతిలో మరో మూడు నాలుగు సినిమాలు ఉండేవి.
కానీ ఎప్పటిలాగే తాను ఒక ఫ్లాప్ సినిమాని ప్రేక్షకులకు ఇచ్చాడు.

ఇక రమేష్ కేవలం దర్శకుడు అనుకుంటే పొరపాటే.అతడు నటుడు కూడా .మహేష్ బాబు ( Mahesh Babu )సినిమా బాబి చిత్రంలో సునీల్ ఫ్రెండ్ పాత్రలో మెహర్ రమేష్ కనిపించి అందరిని సర్ప్రైజ్ చేశాడు.తాను దర్శకుడుగా కాకముందే ఈ సినిమా వచ్చింది మొదట ఇండస్ట్రీకి నటుడుగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత డైరెక్టర్ గా మారాడు రమేష్ ఇకనైనా ఆ తను సినిమాల పరంగా ఒక అడుగు వెనక్కి వేసి నటించడం మొదలు పెడితే బాగుంటుంది ఎందుకంటే తాను ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా అందుకుంది లేదు… దర్శకుడిగా మార్కులు వేయించుకుంది లేదు.ఇలా స్టార్ హీరోలకు కెరియర్ లో గుర్తుండిపోయే డిజాస్టర్ సినిమాలు ఇస్తూ వస్తున్నాడు.






