మహాత్మా జ్యోతిరావు పూలే 132వ వర్ధంతి వేడుకలు

సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో సామాజిక తెలంగాణ మహాసభ మరియు జంబూదీప జనసమితి,ఎమ్మార్పీఎస్,బీసీ సంక్షేమ సంఘము అధ్వర్యంలో సామాజిక తత్వవేత్త,సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 132 వ వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం తిరుమలగిరి క్రాస్ రోడ్ లోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర కన్వీనర్ కొత్తగట్టు మల్లయ్య మాట్లాడుతూ భారతదేశ కుల వ్యవస్థలో హిందూ మనుధర్మ శాస్త్రం ప్రకారం శూద్రులకు,అంటరాని వారికి విద్య నిషేధించిన సందర్భంలో మొట్టమొదటగా ఆ వర్గాలకు విద్య నేర్పించాలని తన భార్య సావిత్రిబాయి పూలేతో విద్యను అందించిన గొప్ప సంఘసంస్కర్త అని కొనియాడారు.

 132nd Death Anniversary Celebrations Of Mahatma Jyoti Rao Phule-TeluguStop.com

పూలే ఆలోచనలతో ప్రభావితమైన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ భారతదేశ కుల వ్యవస్థ మీద అధ్యయనం చేసి భారత రాజ్యాంగాన్ని అందించారన్నారు.డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తమ జీవితంలో మహాత్మా జ్యోతిరావు పూలేని గురువుగా ప్రకటించుకోవడం జరిగిందని గుర్తు చేశారు.పూలే,అంబేద్కర్ సామాజిక అసమానతలు లేని నూతన సమాజాన్ని ఆశించడం జరిగిందని,ఆ దిశగా సమాజములో నూటికి 90 శాతం ఉన్న ఎస్సీ,ఎస్టీ,బీసీ,ముస్లిం మైనారిటీలు,అగ్రవర్ణ పేదలు ఏకమై ఓటు చైతన్యం ద్వారా రాజ్యాధికారం సాధించుకున్నప్పుడే మహాత్మా జ్యోతిరావు పూలేకు మనము నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జంబుద్వీప జన సమితి రాష్ట్ర కన్వీనర్ పత్తేపురం యాదగిరి,మహాజన సోషలిస్ట్ పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జి కందుకూరి సోమన్న మాదిగ,బీసీ సంక్షేమ సంఘము రాష్ట్ర ఉపాధ్యక్షులు తన్నీరు రామ్ ప్రభు,తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు, మొల్కాపూరి శ్రీకాంత్ గౌడ్,గొల్ల కురుమ హక్కుల నవనిర్మాణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుక్కరాజు తిరుపతి,టిఆర్ఎస్ నాయకులు కందుకూరి ప్రవీణ్,బీసీ సంక్షేమ సంఘం ఉద్యోగ విభాగం రాష్ట్ర కార్యదర్శి అనంతుల శ్రీనివాస్ గౌడ్,బీసీపీ జిల్లా కార్యదర్శి చామకూర నరసయ్య,ఎంఎస్పీ ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకులు కందుకూరి శ్రీను మాదిగ,టీఆర్ఎస్ నాయకులు కందుకూరి రమేష్,ఎమ్మార్పీఎస్ నేత దంతాలపెళ్లి సోమన్న,ఎంసీపీఐ తిరుమలగిరి మండల సీనియర్ నాయకులు నలుగురి రమేష్,మైనార్టీ నాయకులు ఎండి రహిమాన్,అబ్బాస్,కడెం మల్లయ్య,నాగు వెంకన్న,గణేష్,కందుకూరి ఈశ్వర్, పుల్లయ్య,ఎండి రఫీ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube