నల్లగొండ జిల్లా: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ల్యాబియింగ్ చేసి పార్టీ పదవులను పొంది ప్రజాప్రతినిధులుగా గెలిచిన నేతలంతా బీఆర్ఎస్ గూటికి చేరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్న కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డిని,కాంగ్రెస్ పార్టీని విమర్శించటం సిగ్గుచేటని మిర్యాలగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్మడబోయిన అర్జున్ అన్నారు.శుక్రవారం వేములపల్లి మండలం కేంద్రంలో జిల్లా పార్టీ నేత పుట్టల కృపయ్యతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ….
కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ప్రచారం చేస్తున్న ప్రస్తుత బీఆర్ఎస్ వేములపల్లి మండల అధ్యక్షుడు గతంలో కాంగ్రెస్ పార్టీలో పదవులను పొందినది గుర్తుకు లేదా అని ప్రశ్నించారు.
ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి గుర్తింపునిచ్చిన పార్టీపై ఆరోపణలు చేయటం విలువల్లేని రాజకీయాలకు నిదర్శనమన్నారు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని వదిలేసి వెళితే కార్యకర్తలకు,లీడర్లకు నేనున్నానని భరోసా ఇస్తున్న మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బీఎల్ఆర్ పై మరోసారి విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు.నియోజకవర్గ ప్రజలన్నీ గమనిస్తుండ్రని, రానున్న ఎన్నికల్లో గుణపాఠం తప్పదన్నారు.
ఈ సమావేశంలో పుట్టల శ్రీనివాస్,మధు, వెంకటరెడ్డి,శ్రీనివాసరెడ్డి, పల్లా వెంకటయ్య,పుట్టల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.