సూర్యాపేట జిల్లా:విద్యా,వైజ్ఞానిక ప్రదర్శలు విద్యార్థులలో దాగివున్న ప్రతిభను,సృజనాత్మకతను వెలికితీస్తాయని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్,జెడ్పి చైర్ పర్సన్ గుజ్జ దీపికా యుగంధర్ అన్నారు.సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లాస్థాయి విద్యా,వైజ్ఞానిక ప్రదర్శనను వారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి,ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు.భారతీయ శాస్త్రవేత్తలు ఎమ్మెస్ స్వామినాథన్, అబ్దుల్ కలాం,జగదీష్ చంద్రబోస్ లను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో ఎదగాలని ఆకాంక్షించారు.
తెలంగాణ రాష్ట్రం నూతన ఆవిష్కరణలు,వ్యాపార సంస్ధల ఏర్పాటులో దేశంలో ఐదవ స్థానంలో వుందన్నారు.వైజ్ఞానిక ప్రదర్శనలో 518 ప్రదర్శనలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.
జిల్లాలోని ప్రతి పాఠశాల నుండి విద్యార్థులు పెద్ద సంఖ్యలో వచ్చేలా ఏర్పాటు చేయాలని అన్నారు.విద్యార్దులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ప్రతి ఒక్కరూ తిలకించి, విద్యార్దులను ప్రోత్సాహించాలన్నారు.
జిల్లా పరిషత్ తరపున ప్రతి గవర్నమెంట్ పాఠశాలకు సైన్స్ పరికరాలు అందజేసినట్లు చెప్పారు.ప్రభుత్వ పాఠశాలలకు జిల్లా పరిషత్ నుండి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలకు సాయ సహకారాలు అందజేస్తామని అన్నారు.
విద్యార్దుల వైజ్ణానిక ప్రదర్శనలను సందర్శించి,అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమం నిర్వహణకు సహకరించిన ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు,సుధాకర్ పివిసి సంస్ధకు,డిఇవో అశోక్,జిల్లా సైన్స్ ఆఫీసర్ దేవరాజ్ అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జెడ్పి సిఇవో సురేష్,డిఇఓ అశోక్, సుధాకర్ పివిసి ఎండి మీలా మహదేవ్, డైరెక్టర్ మీలా వాసుదేవ్,విద్యాశాఖ ఎడి శైలజ,ట్రస్మా జిల్లా అధ్యక్షులు కోటిరెడ్డి, కో కన్వినర్లు,ఎంఇఓలు, ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు, విద్యార్దులు,పాల్గొన్నారు.ఈ సందర్భంగా జవహర్ బాలభవన్ విద్యార్దుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.