బీఆర్ఎస్ లో గాంధీనగర్ మత్స్య పారిశ్రామిక సంఘం సభ్యులు

సూర్యాపేట జిల్లా: సూర్యాపేటలోని 13 వ వార్డ్ గాంధీనగర్ కు చెందిన మత్స్య పారిశ్రామిక సంఘం సభ్యులు బీఎస్పీకి రాజీనామా చేసి,జిల్లా కేంద్రంలోని విద్యానగర్ పార్టీ కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

 Members Of Gandhinagar Fisheries Industrial Association In Brs, Gandhinagar, Fi-TeluguStop.com

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్యకార వృత్తిని ప్రోత్సహించి మా జీవితాల్లో వెలుగులు నింపిన బీఆర్ఎస్ వైపే మా ప్రయాణమన్నారు.

తెలిసో తెలియక బీఎస్పీలోకి వెళ్లామని,తాము తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి రావడం ఆనందంగా ఉందన్నారు.

పార్టీలో చేరిన వారిలో బంటు మారయ్య,దువ్వ మల్లేష్, గోడదాటి సైదులు,దాసరి ఉప్పలయ్య,తిరుపతి రవి, మొర రామచంద్రు, చెన్నబోయిన అంజయ్య, లక్ష్మయ్య,బుచ్చిబాబు ఉన్నారు.వీరితో పాటు వందమంది మత్స్యకారులు బీఆర్ఎస్ 13 వ వార్డ్ అధ్యక్షుడు రఫీ,జనార్దన్ ఆధ్వర్యంలో గులాబీ గూటికి చేరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube