సూర్యాపేట జిల్లా:జిల్లా ఎస్పి రాజేంద్రప్రసాద్ ఆదేశాల మేరకు నడిగూడెం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో పోలీస్ కళాబృందం చేత సోమవారం మండల కేంద్రంలోని బాలికల గురుకుల విద్యాలయంలో బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థునిలకు బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలు మరియు షీ టీమ్స్,సైబర్ నేరాలు, నకిలీ విత్తనాలు,రోడ్డు నియమనిబంధనలు,100 డైల్,సోషల్ మీడియా వంటి అంశాలపైన పోలీస్ కళాబృందం వారు ఆట,పాట,మాటలతో అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో నడిగూడెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఏడుకొండలు మరియు సిబ్బంది, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం,విద్యార్థునిలు పాల్గొన్నారు.