సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు.ఇందులో భాగంగా ఆయన రేషన్ షాపులను స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రేషన్ రైస్ రీసైక్లింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.రేషన్ షాపులకు గత ప్రభుత్వం సబ్సిడీ డబ్బులు ఇవ్వలేదన్న ఆయన ఏ సెక్యూరిటీ లేకుండా రూ.22 వేల కోట్ల ధాన్యం మిల్లర్ల దగ్గర పెట్టారని మండిపడ్డారు.సివిల్ సప్లై కార్పొరేషన్ రూ.11 వేల కోట్ల నష్టాల్లో ఉందని తెలిపారు.రాజకీయ దురుద్దేశంతో సివిల్ సప్లై కార్పొరేషన్ ను నడిపించారని ఆరోపించారు.
తెలంగాణలో స్టాక్ పెట్టుకోవడానికి కూడా స్థలం లేదని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో సివిల్ సప్లై కార్పొరేషన్ లో లోపాలను సరి చేస్తామని తెలిపారు.