జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) ప్రజెంట్ గ్లోబల్ స్టార్ గా వెలుగొందుతున్న క్రమంలో ఈయన భారీ లైనప్ ను కూడా సెట్ చేసుకుంటూ ముందుకు వెళుతున్న విషయం తెలిసిందే.ఆర్ఆర్ఆర్ వంటి ఒకే ఒక్క సినిమాతో అందరిని ఆకట్టుకున్న తారక్ క్రేజీ లైనప్ సెట్ చేసుకోగా అందులో బాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా ఉంది.
ఎన్టీఆర్ అండ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్( Hrithik Roshan ) కాంబోలో ”వార్ 2” ప్రకటించిన విషయం తెలిసిందే.ఊహించని ఈ కాంబో ప్రకటించడమే సెన్సేషనల్ అయ్యింది.
ఇందులో ఒక హీరోయిన్ గా కియారా అద్వానీ( Kiara Advani ) ఫిక్స్ అయ్యింది.యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థపై అత్యంత భారీ స్థాయిలో ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

యాక్షన్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ( Director Ayan Mukerji ) తెరకెక్కించనున్న ఈ ”వార్ 2” ( War 2 )లో హీరోలు ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.అయితే తాజాగా ఈ సినిమా షూట్ గురించి ఒక అప్డేట్ వైరల్ అయ్యింది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.కానీ హృతిక్ రోషన్ కానీ, ఎన్టీఆర్ కానీ పాల్గొనలేదు.డైరెక్టర్ ఈ హీరోలు ఇద్దరు లేని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.తాజాగా స్పెయిన్ లో మొదటి షెడ్యూల్ షూట్ పూర్తి అయ్యింది.
మరి హృతిక్, తారక్ ఎప్పుడు కలవబోతున్నారు అనేది ఇప్పుడు తెలుస్తుంది.హృతిక్ ఏ క్షణమైనా షూట్ లో జాయిన్ కావొచ్చని తెలుస్తుంది.

ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు అంటే అందుకు కూడా సమయం తెలుస్తుంది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జనవరి నుండి తారక్ బరిలోకి దిగబోతున్నారు అని అప్పటి నుండే ఎన్టీఆర్ ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించినట్టు తెలుస్తుంది.ఇది యాక్షన్ థ్రిల్లర్( Action Thriller ) కావడంతో ఎన్టీఆర్ ఈ సినిమా కోసం చాలా రోజుల డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ షెడ్ ఉన్న రోల్ ను పోషిస్తున్నాడని టాక్ రాగా దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.ప్రజెంట్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా( Devara ) చేస్తున్నాడు.ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తుండగా ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఇక ఈ సినిమా షూట్ పూర్తి కాగానే వార్ 2 లో ఎన్టీఆర్ జాయిన్ కానున్నాడు.







