మా తండాను పంచాయితీగా మార్చండి...లేదంటే ఉర్లుగొండలో కలపండి

సూర్యాపేట జిల్లా:మోతె మండలం రావికుంట తండా గ్రామ పంచాయితీ పరిధిలోని రాందాస్ తండావాసులు తమ గ్రామాన్ని ప్రత్యేక గ్రామ పంచాయితీగా మార్చాలని లేదా ఉర్లుగొండ పంచాయితీలో విలీనం చేయాలని కోరుతున్నారు.సుమారు 300 జనాభా ఉన్న తండాను గతంలో కేసీఆర్ తండాలను పంచాయతీలుగా చేసినప్పుడు విస్మరించారని,గత పది ఏండ్లుగా రావికుంట తండా ఆవాస గ్రామంగా ఉంటూ అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 Make Our Thanda A Panchayat Or Merge It Into Urlugonda, Thanda , Panchayat ,mer-TeluguStop.com

తండాలో సరైన వసతులు లేక,రోడ్డు,రవాణా సౌకర్యం లేక,ఏ అధికారిని కలవాలన్నా వేరే చోటుకు వెళ్లాల్సి వస్తుందని,తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.స్థానిక ఎమ్మేల్యే పద్మావతి రెడ్డి చొరవ తీసుకుని మా రాందాస్ తండాను ప్రత్యేక గ్రామ పంచాయితీగా చేయాలని,లేదంటే మాకు అనుకూలంగా ఉన్న ఉర్లుగొండ పంచాయితీలో కలిపేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

ఈ విషయమై పలువురు అధికారులకు చెప్పినా ఫలితం లేకుండా పోయిందని,గ్రామస్థులు భూక్యా దస్రు,వెంకన్న, నాగేష్,లాలూ,శ్రీను గటేష్,పాపయ్య,శ్రీను తదితరులు పలుమార్లు మీడియా ద్వారా తమ ఆకాంక్షను వెల్లడించినట్లు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube