చిన్నగూడెం రైతుల గోస ఎవరికీ పట్టదా...?

నల్లగొండ జిల్లా:పెద్దవూర మండలం చిన్నగూడెం గ్రామ రైతుల గోస మామూలుగా లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సాగునీరు అందించే కాలువపై బ్రిడ్జీ లేకపోవడంతో అవస్థలు పడుతున్నామని,గతపదేళ్లుగా ఎవరూ పట్టించుకోక రైతులే ముందుకొచ్చి తాత్కాలిక బ్రిడ్జి నిర్మాణం చేసుకున్నామని,అది నీటి ప్రవాహానికి దెబ్బతింటే మళ్ళీ ఏర్పాటు చేసుకున్నామని,ఇప్పుడు అది కూడా వర్షాలకు దెబ్బతిన్నదని వాపోతున్నారు.

 No One Cares About The Farmers Of Chinagudem, No One Cares , Farmers ,chingaudem-TeluguStop.com

గత పాలకులు శిలా ఫలకం వేసి చేతులు దులుపుకున్నారని,తమ పరిస్థితి మారాలని గ్రామస్తులు అంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించామని,కానీ,ఈ ప్రభుత్వంలో కూడా తమకు అదే పరిస్థితి ఏర్పడిందంటున్నారు.ఎన్నికల సమయంలో బ్రిడ్జి నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారని, స్థానిక ఎమ్మెల్యే,ఎంపీ చొరవ తీసుకొని ఆ హామీని అమలు చేయాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube