దేశ వ్యాప్తంగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.ఆయన ఒక కొత్త తరహా మార్కెటింగ్ ట్రిక్‌తో తన కస్టమర్లను ఆకర్షిస్తూ వస్తున్నాడు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 40 రూపాలు పెట్టి తయారు చేసే వస్తువుకు 50 రూపాయలు ఖర్చు చేసి 100 రూపాయలకు అమ్ము కోవాల్సిన పరిస్థితి ఉంది.ఒక వస్తువు మార్కెటింగ్ కోసం సెలబ్రెటీలను స్టార్స్‌ను ఆశ్రయిస్తున్నారు.
చిన్నా పెద్దా అనే తేడా లేకుండా యాడ్స్‌కు కోట్లుగుమ్మరిస్తున్నారు.కాని లలిత జువెలర్స్ అధినేత కిరణ్ మాత్రం సెలబ్రెటీలతో ప్రమోషన్ చేయించడు.
అలా కోట్లు మిగుల్చుకున్నాడు.తన జువెలర్స్‌కు తానే ప్రమోట్ చేసుకుంటాడు.
డబ్బులు ఎవరికి ఊరికే రావు, డబ్బులు సంపాదించాలంటే చాలా కష్టపడాలి.అంత కష్టపడి సాధించిన, సంపాదించిన డబ్బును ఎందుకు అంత సులభంగా పోగొట్టుకోవాలి అనేది గత దశాబ్ద కాలంగా కిరణ్ చెబుతున్న మాటలు.అవి తెలుగు వారిలో ఎంతగా జీర్ణించుకు పోయాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మూడు పూవులు ఆరు కాయలు అన్నట్లుగా ఈయన వ్యాపారం ఉంది.ఎప్పుడు చూసిన ఈయన నీట్ గుండుతో కనిపిస్తూ ఉంటాడు.గుండుకు కారణం ఏంటీ అంటూ చాలా మంది చాలా రకాలుగా అడిగారు.
ఆయన మాత్రం వింత సమాధానంలు చెబుతాడు.
తాజాగా ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కిరణ్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించారు.
అదే సమయంలో తాను జుట్టు ఎందుకు పెంచనో కూడా క్లారిటీ ఇచ్చాడు.నాకు నా వయసు చెప్పుకోవడం అస్సలు ఇష్టం ఉండదు.నా వయసు ఎంత అనే విషయాన్ని ఎవరి వద్ద చెప్పాలని నేను ఎప్పుడు అనుకోను.నా వయసు నా జుట్టు లేదా గడ్డం మీసాల వల్ల తెలియవద్దనే ఉద్దేశ్యంతో వాటిని ఎప్పటికప్పుడు తీస్తూ ఉంటాను.
జుట్టు లేదా గడ్డం వచ్చినట్లయితే వాటిలో తెల్ల వెంట్రుకలు ఉండటం లేదా ఊడిపోవడం జరుగుతుంది.దాంతో నా వయసును అంచనా వేసే అవకాశం ఉంది.అందుకే నేను నా వయసును దాచుకునే ఉద్దేశ్యంతోనే గుండుతో ఉంటాను అన్నాడు.గుండు కోసం ప్రతి రోజు షేవింగ్ చేస్తానంటూ స్వయంగా కిరణ్ చెప్పుకొచ్చాడు.కిరణ్ చెప్పిన ఈ రీజన్ సిల్లీగా అనిపిస్తుంది.కాని ఆయన కాన్సెప్ట్ నిజమేనేమో అని కూడా అనిపిస్తుంది.
గుండైనా, బొండైనా కిరణ్ ఈజ్ ది గ్రేట్.క్రింది స్థాయి నుండి ఆయన ఎదిగిన తీరు అద్బుతం, ఎంతో మందికి ఆదర్శనీయం.