తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3 ఆదివారం నాటి ఎపిసోడ్‌తో 50 రోజులు పూర్తి చేసుకుంది.ప్రస్తుతం 8వ వారం సాగుతోంది.
వరుసగా అయిదు వారాల పాటు షో నుండి కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు.కాని ఆరవ వారంలో రమ్యకృష్ణ రావడం, పండుగ, నాగ్ లేకపోవడం ఇలా రకరకాల కారణం వల్ల ఎలిమినేషన్స్ చేయలేదు.
ఆ తర్వాత వారం అంటే మొన్నటి ఆదివారం నాడు అలీ రెజాను ఎలిమినేట్ చేయడం జరిగింది.అలీ ఎలిమినేట్ అవ్వడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు బిగ్‌బాస్ 3 నిర్వాహకులపై వ్యక్తం అవుతున్నాయి.
ఇప్పటికే ఆట మరీ చప్పగా సాగుతోంది.ఇలాంటి సమయంలో అలీని కూడా ఎలిమినేట్ చేయడం ఏంటీ అంటూ తిట్ల దండకం అందుకుంటున్నారు.
అలీ ఎలాగైనా సేవ్ అవుతాడు అంటూ చాలా మంది తాము ఓట్లు వేయలేదు అంటున్నారు.అలీతో ఇంటి సభ్యుల బాండింగ్ మరీ ఇంత ఉందని తెలిస్తే అసలు ఆయనకు ఓట్లు తప్పకుండా వేసేవాళ్లం అంటూ కొందరు అంటున్నారు.అలీకి భారీగానే ఓట్లు పడ్డా కూడా ఇంటి సభ్యులతో అతడు అగ్రసివ్‌గా ఉంటున్న కారణంగా బిగ్‌బాస్ తన సొంత నిర్ణయం తీసుకుని ఎలిమినేట్ చేసి ఉంటాడు అంటూ అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
సోషల్ మీడియాలో అలీ రెజా ఎలిమినేషన్‌పై వస్తున్న విమర్శల నేపథ్యంలో బిగ్‌బాస్ నిర్వాహకులు మళ్లీ అలీని హౌస్‌లోకి పంపించే ఉద్దేశ్యమై ఆలోచిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.కొందరు అలీ రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని భావించే వారు ఈ పుకారు పుట్టించి ఉంటారు.అలీ రెజా రీ ఎంట్రీ అనేది దాదాపు అసాధ్యం.
ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు వైల్డ్ ఎంట్రీలు ఇచ్చారు.దానికి తోడు గత సీజన్‌లో ఎలిమినేషన్ అయిన వారిని తీసుకుంటే తీవ్ర విమర్శలు వచ్చాయి.
అందుకే ఈసారి అలీకి ఛాన్స్ లేదని, రీ ఎంట్రీ అనేది కేవలం పుకారే.