నల్లగొండ జిల్లా:నల్లగొండ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నాంపల్లి భాగ్య రెండోసారి నియమితులయ్యారు.హైదరాబాదులోని గాంధీభవన్ లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీతారావు,జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి చేతుల మీదుగా ఈ మేరకు నాంపల్లి భాగ్య నియామక పత్రాన్ని అందుకున్నారు.
అదేవిధంగా మహిళా కాంగ్రెస్ పట్టణ కార్యదర్శులుగా నిర్మల, నవనీతను నియమించారు.ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
నల్లగొండ పట్టణంలో మహిళా కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తానని తెలిపారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు మహిళా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని కార్యక్రమాలను విజయవంతం చేస్తానని పేర్కొన్నారు.