సాగర్ ఆఫీసర్ క్లబ్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో...!

నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని ఆఫీసర్ క్లబ్,కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించి సొమ్ము చేసుకుంటున్నారని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు గురువారం నాగార్జున సాగర్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా నందికొండ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మంద రఘువీర్ (బిన్నీ) మాట్లాడుతూ ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వ భూములపై కన్నేసి ప్రభుత్వ అధికారులతో కలిసి కోట్ల విలువచేసే ఆస్తులను కొల్లగొడుతున్నారని ఆరోపించారు.

 Sagar Officer's Club In Private Hands , Sagar Officer, Vice Chairman Manda Raghu-TeluguStop.com

అదేవిధంగా అనేక సంవత్సరాల నుండి ఆటల పోటీలకు ప్రజా ఆదరణ పొందిన ఆఫీసర్ క్లబ్ లో ఆటలకు కొనసాగిస్తామన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఆఫీసర్ క్లబ్ ను ఇండోర్ స్టేడియంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మనందరెడ్డి,మద్దుకూరి రాంబాబు,గంజి అనిల్, ఉంగరాల శ్రీను,హర్ష, వాసు,శివ,నక్కకిషోర్,శివ నాగులు,పెద్ద శ్యామ్, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube