సాగర్ ఆఫీసర్ క్లబ్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో…!

నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని ఆఫీసర్ క్లబ్,కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించి సొమ్ము చేసుకుంటున్నారని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు గురువారం నాగార్జున సాగర్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా నందికొండ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మంద రఘువీర్ (బిన్నీ) మాట్లాడుతూ ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వ భూములపై కన్నేసి ప్రభుత్వ అధికారులతో కలిసి కోట్ల విలువచేసే ఆస్తులను కొల్లగొడుతున్నారని ఆరోపించారు.

అదేవిధంగా అనేక సంవత్సరాల నుండి ఆటల పోటీలకు ప్రజా ఆదరణ పొందిన ఆఫీసర్ క్లబ్ లో ఆటలకు కొనసాగిస్తామన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఆఫీసర్ క్లబ్ ను ఇండోర్ స్టేడియంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మనందరెడ్డి,మద్దుకూరి రాంబాబు,గంజి అనిల్, ఉంగరాల శ్రీను,హర్ష, వాసు,శివ,నక్కకిషోర్,శివ నాగులు,పెద్ద శ్యామ్, యువకులు తదితరులు పాల్గొన్నారు.

నాగ్ అశ్విన్ ఫ్యామిలీ ఆ ఊరిలో సాయిబాబా ఆలయాన్ని నిర్మించిందా. గ్రేట్ అంటూ?