నల్లగొండ జిల్లా:మిర్యాలగూడ నియోజకవర్గ( Miryalaguda Assembly Constituency ) పరిధిలో పార్కింగ్ చేసిన వాహనాలే టార్గెట్ గా అద్దాలు పగల గొట్టి డబ్బులు దొంగిలిస్తూ పోలీసులకు చిక్కకుండా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఘటనలపై వార్తాపత్రికల్లో ప్రచురించిన కథనాలను మిర్యాలగూడ పోలీసులు సవాల్ తీసుకుని ఎట్టకేలకు వెహికిల్ లో దోపిడీ ఘటనలకు పాల్పడిన ఇద్దరు సభ్యుల అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశారు.ఏపికి చెందిన పిట్ల మహేష్,ఆవుల రాకేష్ అనే ఇద్దరు అంతర్ రాష్ట్ర నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా వీరు నెల్లూరు జిల్లా,బోగొల్ మండలం, కప్రాలతిప్ప గ్రామానికి చెందిన వారుగా తెలిసిందని గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు ( DSP Rajasekhar Raju )కేసుల వివరాలను వెల్లడించారు.
గురువారం ఉదయం కోదాడ-జడ్చర్ల ఎన్‌హెచ్ 167( Kodad , Jadcherla ) పై బాదలాపురం బస్ స్టేజీ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు ఏపీ 39 హెచ్ జె 8369 నెంబరు గల ఎర్తీగా కారులో వస్తుండగా ఆపి చెక్ చేయగా,వాహనంలో అద్దాలను పగలగొట్టుటకు వాడే పనిముట్లు,కొంత నగదు ఉందడంతో అదుపులోకి తీసుకుని విచారించగా మిర్యాలగూడ ప్రాంతంలోచేసిన చోరీలను ఒప్పుకున్నట్లు తెలిపారు.వీరి వద్ద నుండిరూ.2,77,000/-నగదు,రెండు సెల్ ఫోన్లు,ఒక ఎర్టిగా కారు, కొన్ని పనిముట్లు స్వాధీనం చేసుకొని,రిమాండ్ కుతరలించామన్నారు.కేసులను త్యరితగతిన ఛేదించి, నిందితులను పట్టుబడి చేసి, చోరీ చేసిన సొత్తు రికవరీ చేసిన మిర్యాలగూడ రూరల్ సిఐ వీరబాబు,ఎస్‌ఐ సతీష్, సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ వివి గిరి,కానిస్టేబుల్స్ ప్రభాకర్ రెడ్డి,శ్రీనివాస్,కె.
సైదులును డీఎస్పీ అభినందించారు.