పాల్వాయి ఇంటింటి ప్రచారం

నల్లగొండ జిల్లా:మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చండూర్ మండలం తుమ్మలపల్లి గ్రామలో మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని చేపట్టారు.ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

 Palvai Door To Door Campaign-TeluguStop.com

ఎస్సీ కాలనీ నెలకొన్న విద్యుత్ సమస్యపై విద్యుత్ అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేశారు.అనంతరం ఆమె మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గ పరిధిలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఊళ్ళో సమస్యలను చూస్తే తెలుస్తుందన్నారు.

పాల్వాయి గోవర్ధన్ రెడ్డి బిడ్డగా చెబుతున్నా మీ సమస్యలను పరిష్కరిస్తాను.రానున్న ఉప ఎన్నికల్లో నన్ను గెలిపించండని కోరారు.

గ్రామస్తుల నుండి, మహిళలనుండి మంచి స్పందన లభించినట్లు ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube