తెలంగాణ విమోచన దినోత్సవాల నేపథ్యంలో హైదరాబాద్కు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు.
దీనిలో భాగంగా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా జాతీయ నాయకత్వం అంచనాలను అందుకోలేక పోతున్నారని చెప్పారు.
అదేవిధంగా పార్టీలో ఐక్యత కొరవడినట్లు సమాచారం ఉందని వ్యాఖ్యనించారు.
ప్రజల్లో బీజేపీ పట్ల ఆసక్తి ఉందని.
నేతలు ఇంకా కష్టపడితేనే ఫలితం ఉంటుందని అమిత్ షా తెలిపారు.బండి సంజయ్ చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్రకు స్పందన బాగుందన్నారు.
ఈ విధంగానే మిగతా నేతలందరూ ప్రజల్లో ఉండాలని సూచించారు.టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై దూకుడు పెంచాలని చెప్పినట్లు తెలుస్తోంది.
అదేవిధంగా మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించాలని అమిత్ షా ఆదేశించారు.ఈ ఎన్నిక కోసం త్వరలోనే ఓ కమిటీని నియమించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.







