నల్లగొండ జిల్లా:పార్లమెంట్ ఎన్నికలు కోడ్ నేపథ్యంలో జిల్లాలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి,విస్తృతంగా చేపట్టిన తనిఖీల్లో ఇప్పటి వరకు 9 కోట్ల 17 లక్షల 94 వేలు సీజ్ చేసినట్టు జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఎన్నికలు నేపథ్యంలో అంతరాష్ట్ర సరిహద్దు నిఘా పెంచామని,సరిహద్దు ప్రాంతాలైన వాడపల్లి, అడవిదేవులపల్లి టెయిల్ పాండ్,నాగార్జున సాగర్ అంతరాష్ట్ర ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి అక్రమ రవాణా అడ్డుకుంటున్నమని వివరించారు.
ఆంధ్రా రాష్ట్ర అధికారులతో సమన్వయంతో పని చేస్తున్నామని,అలాగే అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులకు అనుబంధంగా అంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్టులు ఎన్.హెచ్ 65 పై కేతపల్లి టోల్ ప్లాజా, చిట్యాల పోలీసు స్టేషన్ వట్టిమర్తి వద్ద,మాల్ వద్ద, డిండి పోలీసు స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.పారామిలిటరీ సిబ్బంది, ఇతర శాఖలకు చెందిన అధికారుల సహాయంతో జిల్లా అంతటా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 2 కోట్ల 70 లక్ష నగదు,23 లక్షల 10 వేల విలువ గల మద్యం,22 వేల విలువ గల గంజాయి, 5 కోట్ల 73 లక్షల విలువ గల ఆభరణాలు,51 లక్షల 62 వేల విలువ గల ఇతర వస్తువులు సీజ్ చేయడం జరిగిందని వివరించారు.