సూర్యాపేట జిల్లా:జిల్లా పోలీసు కార్యాలయం నందు ఆదివారం భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.
ఆర్.అంబేడ్కర్ 133వ,జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం ట్రైనీ ఐపిఎస్ అధికారి రాజేష్ మీనాతో కలిసి జిల్లా కేంద్రంలో ఖమ్మం క్రాస్ రోడ్ లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పి జనార్ధన్ రెడ్డి,ఆర్ఐలు నారాయణరాజు,నర్సింహ, ఆర్ఎస్ఐ లు,సిబ్బంది పాల్గొన్నారు.