సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులోని శ్రీ ఇష్టకామేశ్వరి శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వరస్వామి దేవస్థానంలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమయ్యింది.తెల్లవారుజామున శివలింగంపై సూర్య కిరణాలు పడ్డాయి.
మహాశివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం సప్తమి నుంచి శివరాత్రి వరకు సూర్యకిరణాలు పడతాయని ఆలయ పూజారులు తెలిపారు.శివలింగంపై పడిన సూర్య కిరణాలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు, భక్తులు ఉదయాన్నే పెద్ద సంఖ్యలో శంభు లింగేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు చేశారు.
