సూర్యాపేట జిల్లా:రైతుల ప్రయోజనాల దృష్ట్యా దేశవ్యాప్తంగా అమలవుతున్న ఈనామ్ విధానం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అధికారులు,పాలకవర్గం నిబద్ధతకు నిదర్శనమని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఉప్పల లలితా దేవి ఆనంద్ అన్నారు.ఈ నామ్ విధానం ఆరేండ్లు పూర్తిచేసుకున్న సందర్బంగా శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయం కేక్ కట్ చేసి రైతులు,మిల్లర్లు,ట్రేడర్లు,కమీషన్ దారులు,ఆడితిదారులు,దడవాయిలను ఘనంగా పూలమాలలు శాలువాలతో సన్మానించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ సూర్యాపేట మార్కెట్లో అమలవుతున్న ఈనామ్ విధానం పలు రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.ఇతర రాష్ర్టాలైన ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ కు చెందిన ఉన్నతస్థాయి అధికారులు వచ్చి పరిశీలించి కితాబిచ్చినట్లు గుర్తు చేశారు.
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో ఈనామ్ విధానం అమలు చెయ్యడం మూలంగా రైతులకు మంచి ధర లభించడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుందన్నారు.అధికారులు,పాలకవర్గం, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పొద్దున వచ్చిన రైతు సాయంత్రానికి ఇంటికి చేరేలా ఈ నామ్ విధానం పకడ్బందీగా అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటుందన్నారు.
ఈనామ్ విధానం సక్రమంగా అమలయ్యేలా సహకరిస్తున్న మిల్లర్లు,కమీషన్దారులు, అడ్తీదారులు,ట్రేడర్స్,మార్కెట్ అధికార సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తిరుమలగిరి,సిరికొండ,కూసుమంచి,తురకగూడెం గ్రామాలకు చెందిన రైతులు కాంతయ్య,సైదులు, దేవయ్య,లింగరాజు,యశ్వంత్,మహిళా రైతులను సన్మానించారు.
మార్కెట్ అసిస్టెంట్ సెక్రటరీ పుష్పలత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎండీ ఫసియొద్దిన్,గ్రేడ్2 కార్యదర్శి ఎండీ శంషీర్,మార్కెట్ కమిటీ సభ్యులు ముప్పారపు నాగేశ్వర్రావు,బోనాల రవీందర్,ముదిరెడ్డి రమణారెడ్డి,యూడీసీ ఖాసీం,సూపర్వైజర్స్ శ్రవణ్ కుమార్,సమ్మియోద్దీన్,ఎన్.సుధీర్ రావు తదితరులు పాల్గొన్నారు.