బాహుబలి సినిమాతో దర్శకుడు రాజమౌళి తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడమే, హీరో ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ గా చేసాడు.అయితే మొన్నటి వరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడు రాజమౌళితో సినిమా చేస్తేనే పని ఇండియా ఇమేజ్ వస్తుంది అన్న భ్రమలో ఉండేవారు.
కానీ ఇకపై రాజమౌళి మాత్రమే దిక్కు అన్న కాన్సెప్ట్ పక్కన పెట్టేయాల్సిందే.ఎందుకంటే కేవలం రాజమౌళి మాత్రమే కాకుండా సిని ఇండస్ట్రీలో ఇతర దర్శకులు కూడా తెలుగు సినిమాలను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తూ ఆయా హీరోలకు పాన్ ఇండియా స్టార్ లుగా పెడుతున్నారు.
ఇకపోతే రాజమౌళి దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్.ఈ సినిమా కోసం ఇద్దరు స్టార్ హీరోలు రెండున్నరేళ్ల పాటు కష్ట పడిన విషయం తెలిసిందే.
ఈ సినిమాతో ఆ ఇద్దరు హీరోలకు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చి పడిందా అంటే చెప్పలేని పరిస్థితి.మరి ముఖ్యంగా ఎన్టీఆర్ కు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిందా అంటే గ్యారంటీగా చెప్పలేని పరిస్థితి.
పోనీ రాజమౌళి లేకపోతే హీరోలకు పాన్ ఇండియా రాధా అంటే మరి బన్నీ,యష్,విజయ్ దేవరకొండ ల పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఇప్పటికే కే జి ఎఫ్ సినిమాతో యష్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా క్రేజ్ ను దక్కించుకున్నాడు.విజయ్ దేవరకొండ విషయానికి వస్తే ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా గనుక హిట్ అయితే విజయ్ కు వరుసగా బాలీవుడ్ ఆఫర్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాబట్టి హీరోలు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు దక్కాలి అంటే కేవలం రాజమౌళి మాత్రమే దిక్కు అన్న కాన్సెప్ట్ ని పక్కన పెట్టాల్సిందే.సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప పాన్ ఇండియా మూవీ లో విడుదల అయిన విషయం తెలిసిందే.ఆ సినిమాకు రాజమౌళి దర్శకుడు కాదు సుకుమార్ దర్శకుడు.మొత్తానికి కేజీఎఫ్ 2 ఈ సినిమా విడుదల అయిన తరువాత రాజమౌళి సినిమాలో వీక్ స్ట్రిప్ట్ ఆర్ఆర్ఆర్ అని సోషల్ మీడియా కోడై కూస్తోంది.
అంతే కాకుండా ఆర్ఆర్ఆర్ తో పోల్చుకుంటే కేజీఎఫ్ 2 చాలా బాగుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి.