నల్లగొండ జిల్లా:లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు గులాబీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కేటీఆర్ నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలో సమావేశాలు నిర్వహించనున్నారు.
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న సమావేశాల్లో లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.