సూర్యాపేట జిల్లా:ఐదు సంవత్సరాల కాలంలో 64 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రంలో బిజెపి మోడీ ప్రభుత్వం మూసి వేసిందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు.కోదాడ పట్టణంలోని వర్తక సంఘం భవన్లో రెండు రోజుల పాటు జరుగనున్న సిఐటియు సూర్యాపేట జిల్లా మూడో మహాసభలకు బుధవారం ఆయన హాజరై మాట్లాడుతూ కేంద్రం నుండి సహకారం లేకపోయినా 19 కంపెనీలు నష్టాలను అధిగమించి లాభాలతో నడుస్తున్నాయని ప్రభుత్వ రంగ సంస్థల సర్వేలు చెబుతున్నాయని వారన్నారు.
రాష్ట్రంలో 73 షెడ్యూల్ పరిశ్రమల కార్మికుల కనీస వేతనాల జీవోలను సవరించనందున కార్మికులు కోట్లాది రూపాయలు నష్టపోతున్నారని,ఈ కాలంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు కరోనా లాక్ డౌన్ ఫలితంగా కార్మికుల జీవన పరిస్థితులు మరింత దారుణ మయ్యాయని,దీని ప్రభావం అసంఘటితరంగ కార్మికుల పైన అధికంగా పడిందని వారన్నారు.మహాసభలో గత రెండు సంవత్సరాలుగా జరిపిన కార్యక్రమాల్లో నిర్మాణంపై అన్ని విషయాలు చర్చించడం జరిగిందని,కార్మిక వర్గం ఈ రెండు సంవత్సరాల కాలంలో అనేక ఉద్యమాలు నిర్వహించి సిఐటియును ముందుకు నడిపించిందని చెప్పారు.
మళ్లీ భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకొని సిఐటియును ముందుకు నడిపించేందుకు ముందుకు వెళ్తామని వారన్నారు.ఈ యొక్క మహాసభలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నెమ్మాది వెంకటేశ్వర్లు,కోలిశెట్టి యాదగిరిరావు,జిల్లా ఉపాధ్యక్షులు కోటగిరి వెంకటనారాయణ,కోశాధికారి ఎం.రాంబాబు,సోమయ్య, ఏకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.