బీఆర్ఎస్‌కు సూర్యాపేట జిల్లాలో మరో షాక్...?

సూర్యాపేట జిల్లా: జిల్లాలో అధికార బీఆర్ఎస్‌ పార్టీకి మరో షాక్ తగులనుంది.ఇప్పటికే జిల్లాలో అనేక మంది ఉద్యమ నాయకులు,సీనియర్ నేతలు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

 Senior Political Leader Mandula Samuel Resigned To Brs Party, Mandula Samuel ,b-TeluguStop.com

ఈ నేపథ్యంలో తుంగతుర్తి నుండి టికెట్ ఆశించి భంగపడ్డ ఉద్యమ నేత, సీనియర్ నాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ మందుల సామేల్ పార్టీకి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది.శుక్రవారం తిరుమలగిరిలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ను మూడోసారి గెలిపించాలని మంత్రి కేటీఆర్ ప్రకటించడంతో గత కొంతకాలంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్‌ను స్థానికుడినైన తనకే కేటాయించాలని సామేల్ కోరుతున్న విషయం తెలిసిందే.

కేటీఆర్ గాదరి కిషోర్ పేరును ప్రకటించడంతో సామేల్ తీవ్ర మనస్థాపానికి గురైనట్టు తెలుస్తోంది.మొదటి నుండి ఉద్యమంలో పని చేసినా కూడా తనకు గుర్తింపు దక్కడం లేదని సన్నిహితుల దగ్గర సామేల్ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఈ క్రమంలోనే ఆయన బీఆర్ఎస్‌కు రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారని,త్వరలోనే రాజీనామా ప్రకటన చేయనున్నారని,కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.నియోజకవర్గంలో అత్యధిక ఓటు బ్యాంక్ కలిగిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నేతగా మంచి గుర్తింపు ఉన్న సామేల్ రాజీనామా తుంగతుర్తిలో అధికార పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube