సూర్యాపేట జిల్లా:మునగాల మండలం తాడువాయి గ్రామానికి వెళ్లే మార్గంలోని గురప్ప వాగు గురువారం ఉధృతంగా ప్రవహిస్తుంది.గురప్ప వాగు అలుగు పోస్తుండడంతో పరిసర ప్రాంతాల ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పై నుండి వరద నీరు ఉధృతంగా రావడంతో వాగులోని నీటి నిల్వలు పెరిగి అలుగు పారుతుంది.పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
కాజ్ వే వద్ద నీటి ప్రవాహం ఉదృతంగా ఉంటే దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు సూచించారు.ప్రతి వర్షాకాలంలో ఈ గురప్ప వాగు ఉధృతంగా అలుగు పారడం వల్ల మూడు గ్రామాల ప్రజల రాకపోకలు నిలిచిపోతున్నాయి.
దీనితో అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వడం మాములే అయింది.కానీ,ఈ గురప్ప వాగుకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం బాధాకరమని పరిసర గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.







