సూర్యాపేట జిల్లా:పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అన్నిరకాల చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు.
సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ రోడ్లో గల కాకతీయ హై స్కూల్, వివేక వాణి విద్యా మందిర్ హై స్కూల్ లో ఉన్న పరీక్ష కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, పరీక్షా కేంద్రాల్లో విద్యుతీకరణ,త్రాగునీటి వసతులను పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు రాసే పిల్లలకు ప్రశాంత వాతావరణ కల్పించాలని, పరీక్షలు సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు ఉండాలని,
ఎలక్ట్రానిక్ వస్తువులు,మొబైల్ ఫోన్లకు అనుమతి లేదని, ప్రతి ఒక్కరిని తనిఖీ చేసిన తర్వాతే లోనికి పంపాలని ఆదేశించారు.
జిల్లావ్యాప్తంగా మొదటి రోజు తెలుగు పరీక్షకు మొత్తం 11,943 మంది విద్యార్థులకు గాను 11,904 మంది విద్యార్థులు (99%) హాజరయ్యారని,39 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.ఈకార్యక్రమంలో ఇంచార్జీ ఎంఈఓ శైలజ,ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.