సూర్యాపేట జిల్లా:కులగణనపై అనేక అనుమానాలు ఉన్నాయని,మళ్లీ సర్వే చేయాలని బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రామిశెట్టి మురళి ప్రసాద్ డిమాండ్ చేశారు.శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఆయన మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చి తప్పిందని, బీసీలకు అన్యాయం చేసిందన్నారు.
మంత్రి ఉత్తమ్ బీసీల విషయంలో చొరవ తీసుకోని కుల గణన మళ్ళీ చేసే విధంగా మరియు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు జరిగే విధంగా ముందుకు వెళ్లే ఆలోచన చేయాలని కోరారు.