కంటి నిండా నిద్ర ఉంటేనే శరీరం యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంటుంది.లేదంటే ఏదో ఒక అనారోగ్య సమస్య చుట్టుముట్టేందుకు సిద్ధం అయిపోతుంది.
మరియు నీరసం, అలసట, తల నొప్పి వంటి సమస్యలు సైతం తీవ్రంగా విసిగిస్తుంటాయి.అందుకే నిద్రను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు.
అయితే ఎంత పడుకుందామన్నా కొందరికి నిద్ర పట్టనే పట్టదు.ఎప్పుడో ఒక రోజు ఇలా జరిగితే పెద్ద ఇబ్బందేమి ఉండదు.
కానీ, రోజూ ఇలానే జరుగుతుంటే మాత్రం చికాకు పుట్టేస్తుంది.
ఈ క్రమంలోనే ఏం చేయాలో అర్థంగాక కొందరు స్లీపింగ్ పిల్స్‌కి అలవాటు పడుతుంటారు.
అయితే వాస్తవానికి నిద్ర బాగా పట్టాలంటే కొన్ని కొన్ని పోషకాలు ఎంతో అవసరం.అవి లోపించినప్పుడే నిద్ర సమస్యలు వేధిస్తాయి.
మరి ఎందుకు ఆలస్యం సుకంగా నిద్ర పోవాలంటే ఏయే పోషకాలు తీసుకోవాలో చూసేయండి.

కంటి నిండా నిద్ర పట్టాలంటే మెగ్నీషియం తప్పని సరిగా తీసుకోవాలి.రోజుకు అవసరమైన కనీస మెగ్నీషియం తీసుకుంటేనే నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ ఉత్పత్తి అవుతుంది.అలాగే విటమిన్ బి 12 లోపం ఏర్పడినా నిద్ర సరిగ్గా పట్టదు.
మరియు అలసట చాలా అధికంగా ఉంటుంది.కాబట్టి, రోజూ విటమిన్ బి 12 ఉండే ఆహారాలను డైట్‌లో చేర్చు కోవాలి.
మీకు ప్రతి రోజూ నిద్ర సరిగ్గా పట్టడం లేదు అంటే ఖచ్చితంగా విటమిన్ సి ఫుడ్స్‌ను ఆహారంలో భాగంగా చేసుకోవాల్సి ఉంటుంది.ఎందు కంటే, రక్తంలో విటమిన్ సి కంటెంట్ తగ్గినప్పుడు కూడా నిద్ర లేమికి గురవుతారు.
ఇక ఇవే కాదు నిద్ర బాగా పట్టాలీ అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్, విటమిన్ డి వంటి పోషకాలను కూడా ప్రతి రోజు తీసుకోవాలి.తద్వారా నిద్ర సమస్యలన్నీ దూరం అవుతాయి.