ముఖ్యంగా చెప్పాలంటే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి( Sri Venkateswara Swamy ) తిరుమల కొండపై వెలిశాడు.వేల మంది భక్తులు తిరుమలకు తరలివస్తూ ఉంటారు.
కోరిన కోరికలు తీర్చే దైవంగా శ్రీవారికి దేశవ్యాప్తంగా ఎంతో పేరు ఉంది.అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా స్వామివారికి ఎంతోమంది భక్తులు ఉన్నారు.
అందుకే ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు తరలివస్తూ ఉంటారు.ఇదే సమయంలో తిరుమలకు సంబంధించిన సమాచారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం( Tirumala Tirupati Devasthanam ) తెలియజేస్తూ ఉంటుంది.

అలాగే టీటీడీ నుంచి వచ్చే సమాచారం కోసం భక్తులు కూడా వేయికళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు.ఇప్పటికే అనేక శుభవార్తలను చెప్పిన తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా భక్తులకు మరో శుభవార్త చెప్పింది.శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మండలి శుభవార్త చెప్పింది అని కచ్చితంగా చెప్పాలి.అయితే వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ పూర్తి అయింది.దీంతో తదుపరి సర్వదర్శన టోకెన్ల విషయంలో టీటీడీ కీలక సమాచారం ఇచ్చింది.సర్వదర్శన టోకెన్లను జనవరి రెండవ తేదీ నుంచి జారీ చేస్తామని తిరుమల దేవస్థానం వెల్లడించింది.

డిసెంబర్ 23 నుంచి వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ వరకు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన సర్వదర్శన టోకన్లను జారీ చేయడం పూర్తి అవుతుంది.తిరుమలలో విష్ణు నివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, బైరాగి పట్టేడలోని రామానుడు హైస్కూల్, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, MR పల్లి లోని ప్రభుత్వ పాఠశాల.ఇంకా 90 కౌంటర్లలో 10 రోజులకు గాను నాలుగు లక్షలకు పైగా సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లను సోమవారం ఉదయం వరకు జారీ చేస్తారు.ఇంకా చెప్పాలంటే సోమవారం ఉదయంతో ఈ టోకెన్ల జారీ పూర్తి అవుతుంది.
డిసెంబర్ 26వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది.ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా శ్రీవారి కి గరుడసేవ( Shrivari Garudaseva ) నిర్వహిస్తున్న సంగతి చాలా మందికి తెలుసు.
ఈసారి శ్రీవారి దేవాలయంలో( Srivari Temple ) అధ్యయనోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో పౌర్ణమి గరుడ సేవ ఉండదని శ్రీవారి భక్తులకు తిరుమల దేవస్థానం వెల్లడించింది.