మన దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు వారి ఇళ్లలో వారి ఇష్ట దేవతలకు పూజలు చేస్తూ ఉంటారు.దానికోసం వారు ఆ దేవతల విగ్రహాలను ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తూ ఉంటారు.
అయితే చాలామంది ప్రజలు వారి ఇళ్లలో గణపతి విగ్రహాన్ని పెట్టి పూజ చేస్తూ ఉంటారు.ఈ విధంగా గణపతి విగ్రహానికి పూజ చేయడం వల్ల సిరి సంపదలు వారి ఇంట్లోకి వస్తాయని చాలామంది భక్తులు నమ్ముతారు.
ఇంకా చెప్పాలంటే వారు చేసే పనులలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ పనులు పూర్తి అవుతాయని కూడా నమ్ముతారు.అయితే ప్రతిరోజు ఇంట్లో ఉన్న గణపతి విగ్రహాన్ని పూజించే సమయంలో కొన్ని జాగ్రత్తలను కచ్చితంగా తీసుకోవాలి.
ముఖ్యంగా గణపతి విగ్రహాలను ప్రతిష్టించే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది.ఇంకా చెప్పాలంటే ఖచ్చితమైన దిశలో ప్రతిష్టించి పూజ చేయడం వల్ల సిరి సంపదలు కలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు.
ఆ ఇంట్లో కుటుంబ సభ్యులంతా సుఖసంతోషాలతో ఉంటారు.ఇలా చేయకుండా గణపతి విగ్రహాన్ని ఎప్పుడు కూడా ఇంటి ప్రధాన ద్వారం లోపలి పై భాగంలోనూ ఉంచకూడదు.
ఇంకా చెప్పాలంటే బాత్రూం పరిసర ప్రాంతాలలో వినాయకుని విగ్రహాన్ని అస్సలు ప్రతిష్టించకూడదు.ఇంట్లో గణపతి విగ్రహాన్ని కనుక ఉంచుకుంటే వినాయకుడు నృత్యం చేస్తున్నటువంటి విగ్రహాలను అస్సలు ఉంచకూడదు.

అట్లాగే ఇలాంటి విగ్రహాలను బహుమతిగా కూడా ఇతరులకు ఇవ్వడం అంతా మంచిది కాదు.ఇంట్లోకి వినాయకుని విగ్రహాన్ని కనుక తెచ్చుకుంటే ఎప్పుడు తొండం కుడి వైపుకు తిరిగి ఉండే వినాయకుని తెచ్చి పూజ చేయడం మంచిది.ఇంకా చెప్పాలంటే వినాయకుడికి పూజ చేసే సమయంలో కేవలం కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిది.అట్లాగే గణపయ్యకి ఎంతో ఇష్టమైన అరటి పండ్లు, ఉండ్రాళ్ళు, గరికను సమర్పించి పూజ చేయాలని ఈ వేద పండితులు చెబుతున్నారు.