జనసేన అధినేత పవన్ కల్యాణ్ రూటే సపరేటు, ఎప్పుడు ఏం మాట్లాడుతారు, ఎలా ఉంటారో, ఎలాంటి ప్రకటనలు చేస్తారో సొంత పార్టీ నేతలకే అర్థం కాని పరిస్థితి.పార్టీలో ఏం జరుగుతుందో ఎటువంటి ప్రకటన ఎప్పుడు వెలువడుతుందో సామాన్య ప్రజలు, అభిమానులు తెలుసు ఉన్నట్టుగానే పార్టీలో లో కీలక వ్యక్తులు కూడా తెలుసుకునే పరిస్థితి జనసేనలో నెలకొందని నేతలు పోతున్నారు.
పవన్ తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో జనసేన పార్టీకి కోలుకోలే ని షాక్ ఇవ్వడం ఖాయమని అంటున్నారు నేతలు.అయితే పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో అంటకాగుతున్నారు అనే విషయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా సొంత పార్టీ నేతలు అభిమానులు కూడా హాట్ టాపిక్ అవుతోంది.
అయితే తెలుగుదేశం పార్టీకి జనసేన ఏమాత్రం పొత్తు లేదని, పార్టీతో అంటకాగడం లేదని పవన్ కళ్యాణ్ పై పై కి ఎంతగా చెబుతున్నా తెర వెనుక జరుగుతున్న వ్యవహారాలు మాత్రం పవన్, బాబు ఒక్కటే అన్నట్టుగానే కనిపిస్తున్నాయి.అంతేకాదు ఈ అనుమానాలు రోజు రోజుకు మరింత బలపడుతున్నాయి.
చంద్రబాబు వ్యూహాలకు తగ్గట్టుగానే జనసేనాని నడుచుకుంటున్నారని గాజువాక లో పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ పసుపు జెండా లతో కోలాహలంగా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందని అంటున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా నిన్నటి రోజున కర్నూలు పర్యటనలో చంద్రబాబు జనసేన నుంచి పోటీ చేయడానికి సిద్ధమైన ఎస్పీవై రెడ్డి ని తెలుగుదేశం లోకి రావాల్సిందిగా, ఆయనకీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పడం అందరికీ తెలిసిందే.దాంతో ఎస్పీవై రెడ్డి జనసేనను వీడి బాబు చెంతకు చేరనున్నారని టాక్ వినిపిస్తోంది.అయితే పార్టీలో ఇలాంటి వాళ్లు చాలామంది ఉన్నారని ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ నేతలే లీకులిస్తున్నారని కొంతమంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
కానీ ఎస్పీవై రెడ్డి పార్టీని వీడతారని వ్యాఖ్యలు వినిపించిన చంద్రబాబు ఆయనకు సాదర స్వాగతం పలికినా పవన్ ఈ విషయాలపై స్పందించకపోవడంతో చంద్రబాబుకి పవన్ మరోమారు సాయం అందించడానికి సిద్దంగా ఉన్నారని స్పష్టం అవుతోంది అంటున్నారు పరిశీలకులు.

ఈ క్రమంలోనే అసలు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ప్రభుత్వంలో ఉన్న తప్పులను వేలెత్తి చూపకుండా కేవలం ప్రతిపక్ష పార్టీ వైసీపీని పవన్ కళ్యాణ్ ఎక్కువగా టార్గెట్ చేయడానికి అసలు కారణం చంద్రబాబు పవన్ ల మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందమేనని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు.అయితే పవన్ ,బాబు ఇద్దరు ఒకటే అనే ప్రచారం గనుకా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళగలిగితే తప్పకుండా ఈ సారి బాబు పవన్ లకి ఘోరమైన ఓటమి తప్పదని అంటున్నారు విశ్లేషకులు.