హైదరాబాద్ లోని మాదాపూర్ డ్రగ్స్ కేసు టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది.ఈ కేసులో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు నిందితులుగా ఉన్నారని తెలుస్తోంది.
డ్రగ్స్ పార్టీ కేసుపై దర్యాప్తు ముమ్మరం చేసిన యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు నిన్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.అరెస్ట్ అయిన వారిలో నిర్మాత సుశాంత్ రెడ్డి, హీరో నవదీప్ స్నేహితుడు రామ్ చంద్ ఉన్నారు.
అయితే మాదాపూర్ లోని సర్వీస్ అపార్ట్ మెంట్ లో డ్రగ్స్ పార్టీ ఇస్తూ సినీ ఫైనాన్షియర్ వెంకట్ తో పాటు మరో ఇద్దరు అధికారులకు దొరికిన సంగతి తెలిసిందే.మరి కొంతమంది ప్రముఖులు పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.
ఈ కేసులో ఇప్పటివరకు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.ఈ క్రమంలోనే డ్రగ్స్ కేసులో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయన్న దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.







