అమెరికాలో భారత సంతతి శతాధిక వృద్ధుడు మృతి.. గాంధీ పాదాలను తాకి, నెహ్రూతో పనిచేసిన ఘనత

అమెరికాలోని క్లీవ్‌లాండ్‌ ఒహియోలో స్ధిరపడిన భారత సంతతికి చెందిన శతాధిక వృద్ధుడు, మాజీ భారత సైన్యాధికారి లెఫ్టినెంట్ కల్నల్ ఓమ్ జుల్కా సెప్టెంబర్ 29న ఫ్లోరిడాలోని తన పామ్ బీచ్ గార్డెన్స్‌ నివాసంలో ప్రశాంతంగా కన్నుమూశారు.ఈ ఏడాది ఆగస్ట్ 30తో అతనికి 104 ఏళ్లు నిండాయి.

 Indian-american Centenarian And Army Veteran Lt Col Om Julka Passed Away , India-TeluguStop.com

ఈ విషయాన్ని జుల్కా స్నేహితుడు, సీనియర్ జర్నలిస్ట్ రాజ్ కన్వార్ తెలిపారు.అమెరికన్ చట్టాల ప్రకారం జుల్కా డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఆయన 100వ ఏట వరకు మాత్రమే చెల్లుతుంది.

జుల్కా జీవనశైలి గురించి రాజ్ కన్వార్ తెలియజేశారు.వయసు అనేది తనకు ఒక సంఖ్య మాత్రమేనని.

తాను వృద్ధాప్యంలో వున్నానని అనిపించదని ఆయన తరచుగా అనేవారని రాజ్ పేర్కొన్నారు.ధూమపానం అలవాటు లేని జుల్కా పరిమితంగా రెడ్ వైన్ తాగేవారని, టీని అమితంగా ఇష్టపడతారని చెప్పారు.

దాల్ రోటీ, కూరగాయలు, కోడి మాంసం, గొర్రె మాంసాన్ని ఇష్టంగా తినేవారని రాజ్ కన్వార్ చెప్పారు.అలాగే పండ్లు, గింజ ధాన్యాలను తీసుకోవడం ప్రతిరోజూ ఒక మైలు దూరం నడవటం, ఏదైనా జబ్బు చేస్తే తప్పించి మందులకు దూరంగా వుండటంతో పాటు మలమూత్ర విసర్జనను క్రమం తప్పకుండా చేయడం.

త్వరగా పడుకుని, త్వరగా లేవటం వంటి అలవాట్లు తనను ఆరోగ్యంగా వుంచాయని రాజ్ కన్వార్‌తో జుల్కా అనేవారట.నలుగురు పిల్లలు, ఏడుగురు మనుమలు, 13 మంది మనవరాళ్లతో సంతోషంగా జీవితాన్ని గడిపినట్లు ఆయన తనతో చెప్పినట్లు రాజ్ ఒక జాతీయ దినపత్రికకు తెలియజేశారు.

ఇక కొత్త భాషలను నేర్చుకునేందుకు జుల్కా ఉత్సాహం చూపేవారట.ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, పంజాబీ, సంస్కృతం, జర్మన్ భాషలలో ఆయన అనర్గళంగా మాట్లాడగలరు.ఈ వయసులో ఇంటర్నెట్‌ని వినియోగించడం, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కూడా నేర్చుకున్నారు.తన పూర్వీకులు, తన వంశస్తులకు సంబంధించిన వివరాలను భవిష్యత్ తరాలకు అందించేందుకు గాను… ‘‘జుల్కా ఫ్యామిలీ ట్రీ’’ని రూపొందించాడు.

తద్వారా గత 400 సంవత్సరాల కాలంలో తన పూర్వీకులు, ప్రస్తుత తరం వారి వివరాలను అందులో పొందుపరిచారు జుల్కా.

Telugu Veteran, China, Cleveland Ohio, India, Indian American, Lt Col Om Julka,

1962లో ఇండో – చైనా యుద్ధ సమయంలో జుల్కా కీలకపాత్ర పోషించారు.అప్పటి రక్షణ శాఖ మంత్రి కృష్ణమీనన్, జనరల్ కౌల్‌లతో కలిసి నిత్యం భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూతో కలిసేవారట.1966లో భారత గణతంత్ర దినోత్సవం నాడు.1965 పాకిస్తాన్‌ యుద్ధంలో ధైర్యసాహసాలు ప్రదర్శించి శౌర్య చక్రకు ఎంపికైన విజేతల పేర్లను ప్రకటిస్తూ అప్పటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పక్కనే నిలబడటాన్ని ఓమ్ జుల్కా తనకు దక్కిన గౌరవంగా భావిస్తారు.1971లో బంగ్లాదేశ్ యుద్ధంలో కూడా జుల్కా పాలు పంచుకున్నారు.నాటి లెఫ్టినెంట్ జనరల్ (ఫీల్డ్ మార్షల్) సామ్ మానెక్షా నాయకత్వంలో ఆయన పనిచేశారు.

ఇకపోతే.1938- 39లో భారత జాతిపిత మహాత్మా గాంధీ ఢిల్లీ పర్యటనలో ఆయన పాదాలను తాకడం తన జీవితంలో మరిచిపోలేని క్షణాల్లో ఒకటిగా జుల్కా చెబుతారు.1948, జనవరి 30న గాంధీ హత్యకు గురైనప్పుడు కూడా జుల్కా ఢిల్లీలోనే వున్నారు.కాగా… జుల్కా కుమారులలో ఒకరు క్లీవ్‌ల్యాండ్ స్టేట్ యూనివర్సిటీలో 2005లో ఓమ్ జుల్కా ఎండోమెంట్ అనే ఎండోమెంట్ ఫండ్‌ను స్థాపించారు.దీని ద్వారా అల్పాదాయ కుటుంబాల నుంచి వచ్చిన తెలివైన విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌ను అందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube