యూఎస్ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌లో రిచర్డ్ వర్మకి కీలక పదవి.. ఇండో అమెరికన్ సంస్థ హర్షం

అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్‌లోని అత్యున్నత దౌత్యస్థానమైన డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా భారత సంతతికి చెందిన రిచర్డ్ వర్మను నామినేట్ చేయడాన్ని అక్కడి ఇండో అమెరికన్ సంస్థ స్వాగతించింది.54 ఏళ్ల రిచర్డ్ వర్మను మేనేజ్‌మెంట్ అండ్ రిసోర్సెస్ డిప్యూటీ సెక్రటరీగా నామినేట్ చేస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటన జారీ చేశారు.

దీనికి యూఎస్ సెనేట్ ఆమోదం లభించినట్లయితే అమెరికా విదేశాంగ శాఖలో అత్యున్నత స్థానంలో వున్న భారతీయుడిగా ఆయన నిలుస్తారు.

దీనిపై ప్రవాస భారతీయుల కోసం పనిచేస్తున్న ‘‘ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ ఫండ్ ’’ స్పందించింది.ప్రస్తుత పరిపాలనా యంత్రాంగాన్ని వైవిధ్యంగా వుంచడానికి, తన ఎన్నికల ప్రచారంలో బైడెన్ ఇచ్చిన హామీకి రిచర్డ్ వర్మ నామినేషన్ చారిత్రాత్మక చర్యగా ఆ సంస్థ వర్ణించింది.

స్టేట్ డిపార్ట్‌మెంట్‌లో ఆయనకు అవకాశం రావడం ప్రజాసేవలో తన సుదీర్ఘమైన, విశిష్టమైన సేవలకు పరాకాష్ట అని ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ ఫండ్ పేర్కొంది.ఈమేరకు ఈ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నీల్ మఖిజా ఓ ప్రకటన విడుదల చేశారు.

కాగా.వర్మ ప్రస్తుతం మాస్టర్ కార్డ్ గ్లోబల్ పబ్లిక్ పాలసీకి జనరల్ కౌన్సెల్, హెడ్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Advertisement

ఈ హోదాలో ఆయన అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా వున్న కంపెనీ చట్టం, విధాన పరమైన విధులను పర్యవేక్షిస్తారు.డెమొక్రాటిక్ పార్టీకి చెందిన రిచర్డ్ వర్మ 2014 నుంచి 2016 వరకు భారత్‌లో అమెరికా రాయబారిగా వ్యవహరించారు.

ఈ ఏడాది ప్రారంభంలోనూ బైడెన్ తన ఇంటెలిజెన్స్ అడ్వైజరీ బోర్డులో సభ్యుడిగానూ రిచర్డ్ వర్మను నియమించిన సంగతి తెలిసిందే.

ప్రెసిడెంట్స్ ఇంటెలిజెన్స్ అడ్వైజరీ బోర్డ్ (పీఐఏబీ) అనేది అధ్యక్షుని కార్యనిర్వాహక కార్యాలయంలో స్వతంత్ర ప్రతిపత్తి గల ఒక ఏజెన్సీ.ఇకపోతే.రిచర్డ్ వర్మ తల్లిదండ్రులు భారత్ నుంచి 1960వ దశకంలో అమెరికాకు వలస వెళ్లారు.

ఆయన తండ్రి దాదాపు నలభై ఏళ్ల పాటు యూనివర్సిటీ ఆఫ్ పీట్స్‌బర్గ్‌లో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పనిచేశారు.వర్మ తల్లి కూడా ఉపాధ్యాయురాలు కావడం విశేషం.జాన్స్‌టౌన్, పెన్సిల్వేనియాలలో రిచర్డ్ వర్మ పెరిగారు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

వెస్ట్‌మాంట్ హిల్‌టాప్ స్కూల్ డిస్ట్రిక్ట్‌లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు.జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ, జార్జ్‌టౌన్ యూనివర్సిటీ లా సెంటర్‌లో ఎల్ఎల్ఎం, వాషింగ్టన్ కాలేజ్ ఆఫ్ లాలో జేడీ, లెహి వర్సిటీలో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో బీఎస్ చేశారు.

Advertisement

తాజా వార్తలు