ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ( Congress party ) హవా నడుస్తోందా ? దేశ వ్యాప్తంగా ఆ పార్టీకి గ్రాఫ్ పెరుగుతోందా ? ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఫలితాలతో అదే రుజువు కానుందా ? అంటే అవుననే సంకేతాలు గట్టిగా కనిపిస్తున్నాయి.ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఏ పార్టీని వరిస్తుందనే విషయాన్ని కాస్త పక్కనపెడితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్పార్టీకి అధిక మెజారిటీని కట్టబెట్టాయి.
ఛత్తీస్ ఘడ్, తెలంగాణ ( Telangana )వంటి రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పగా, మధ్య ప్రదేశ్ లో బీజేపీ కాంగ్రెస్ మద్య టఫ్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉందట.

రాజస్తాన్ విషయానికొస్తే ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికి ఈసారి అధికారం చేతులు మారే ఛాన్స్ కనిపిస్తోందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.అటు మిజోరాంలో కాంగ్రెస్, మరియు బీజేపీ రెండు పార్టీలకు కూడా అధికారం కష్టమే.దీంతో మొత్తం మీద ఐదు రాష్ట్రాలకుగాను మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ సత్తా చాటే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దీన్ని బట్టిచూస్తే కాంగ్రెస్ దశ తిరిగినట్లేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.ఈ ఐదు రాష్ట్రాల్లో హస్తం పార్టీ సత్తా చాటితే ఆ ప్రభావం పార్లమెంట్ ఎన్నికలపై గట్టిగా పడుతుంది.
ఇప్పటికే పది సంవత్సరాలు మోడీ పాలన చూసిన దేశ ప్రజలు అధికార మార్పు కోరుకునే అవకాశం ఉంది.

అలా చూస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ సత్తా చాటడం ఖాయమేమో అనేది కొందరి విశ్లేషకుల అభిప్రాయం.ముఖ్యంగా కాంగ్రెస్ ఈ రేంజ్ లో పుంజుకోవడానికి రాహుల్ గాంధీ( Rahul Gandhi ) చేపట్టిన భారత్ జోడో యాత్రనే అనేది విశ్లేషకులు చెబుతున్న మాట.ఆ యాత్ర కారణంగా అన్నీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పునర్జీవం పోసుకుంది.ఇక కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తరువాత తెలంగాణలో కూడా పరిస్థితులు మారిపోయాయి.ఇక్కడ బిఆర్‌ఎస్ కు చెక్ పెట్టేలా కాంగ్రెస్ బలపడుతూ రావడంతో తెలంగాణలో కూడా హస్తనికే అధికారమా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.
మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో కాంగ్రెస్ తిరిగి బలపడిందనే విషయం స్పష్టంగా అర్థమౌతోంది.