తెలుగులో యంగ్ డైరెక్ట్ శైలేష్ కొలను “హిట్” అనే చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి అందరికీ తెలిసిందే.ఈ చిత్రంలో హీరోగా ఫలక్ నామా దాస్ చిత్ర ఫేమ్ విశ్వక్ సేన్ నటించగా యంగ్ హీరోయిన్ రుహాణి శర్మ హీరోయిన్ గా నటించింది.
కాగా ఈ చిత్రానికి టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించాడు.ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
దీంతో ఈ చిత్రానికి సీక్వెల్ గా పార్ట్ 2 కూడా తీసే పనిలో పడ్డాడు డైరెక్టర్ శైలేష్ కొలను.
అయితే ఈ మధ్య కాలంలో దర్శకుడు శైలేష్ కొలను గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే తెలుగులో మంచి విజయం సాధించిన హిట్ చిత్రాన్ని బాలీవుడ్ లో చేసే అవకాశం రీమేక్ దక్కించుకున్నాడని అందువల్ల హిట్ పార్ట్ 2 ని పక్కన పెట్టేసాడని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.అయితే ఈ వార్తలపై తాజాగా డైరెక్టర్ శైలేష్ కొలను స్పందించాడు.
ఇందులో భాగంగా తాను తెలుగులో హిట్ సీక్వెల్ తీసిన తర్వాతే బాలీవుడ్ లో తన సినిమాని తెరకెక్కిస్తానని స్పష్టం చేశాడు.అంతేకాక ప్రస్తుతం కరోనా వైరస్ కరోనా వైరస్ కారణంగా పరిస్థితులు చక్కబడడానికి కొంత కాలం పడుతుందని ఈ లోపల తన సీక్వెల్ చిత్రం పనులను పూర్తి చేస్తానని తెలిపాడు.
తెలుగులో అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం దర్శక నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.కానీ ఈ చిత్రం విడుదలైన కొన్ని రోజులకే కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూత పడడంతో కొంతమేర దర్శక నిర్మాతలకు నిరాశ చెందినప్పటికీ ప్రముఖ ప్రముఖ డిజిటల్ ఓటిటి అమెజాన్ ప్రైమ్ ఈ చిత్రం కోసం ఎక్కువ మొత్తాన్ని చిత్రయూనిట్ సభ్యులకి సమర్పించింది.