సూర్యాపేట జిల్లా:జిల్లాలో జరగబోవు క్రిస్మస్ పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ తెలిపారు.శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుటకు ఆర్గనైజింగ్ కమిటీ స్పెషల్ ఆఫీసర్లను నియమించారు.
ఈ సందర్భంగా కమిటీతో కలెక్టర్ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకునేందుకు అధికారులతో ఏర్పాటు చేయాలని తెలిపారు.పండుగనాడు బహుమతుల ప్రధానం,ప్రేమ విందు కార్యక్రమం కొరకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.
క్రిస్మస్ సెలబ్రేషన్స్,ప్రేమ విందు ఏర్పాట్లపై కలెక్టర్ పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావు,ఆర్డీవో రాజేంద్రకుమార్,డిడబ్ల్యూఓ శంకర్,కమిటీ సభ్యులు పాల్గొన్నారు.