మునగాల మండలం( Munagala Mandal ) కేంద్రంలోని బాలాజీ రైస్ మిల్లుతో పాటు మునగాల,తాడ్వాయి గ్రామాల్లోని ఐకెపి కేంద్రాలను బుధవారం జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు( District Collector ) ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు రవాణా చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.రైతులు అధైర్య పడవద్దని తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు.
రైస్ మిల్లు యజమానులు దిగుమతులు త్వరగా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, హమాలీలను పెంచి దిగుమతులు వెంటనె అయ్యేవిధంగా చూడాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధికారులు,ఐకెపి సిబ్బంది,మిల్లర్లు పాల్గొన్నారు.