రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే చర్యలు తప్పవు -సివిల్ సప్లై డిటి రామకృష్ణారెడ్డి

నల్లగొండ జిల్లా:రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లై డిప్యూటీ తాహాసిల్దార్ రామకృష్ణారెడ్డి హెచ్చరించారు.శుక్రవారం రేషన్ దుకాణాల తనిఖీలో భాగంగా మిర్యాలగూడ పట్టణం షాబునగర్ లోని షాప్ నెంబర్ 5 ను ఆకస్మికంగా తనిఖీ చేసి బియ్యం నిల్వలను పరిశీలించారు.

 Actions Will Be Taken If Ration Rice Is Diverted ,civil Supply Dt Ramakrishna R-TeluguStop.com

దుకాణం నందు 15 క్వింటాళ్ల 25 కిలోల బియ్యం తక్కువగా ఉండడంతో షాపు నిర్వాహకుడు గంధం శ్రీనివాస్ పై 6ఏ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.షాపులో మిగిలిన నిల్వలను పక్కనే ఉన్న మరో షాపు నెంబర్ 3 కు అప్పగించినట్లు చెప్పారు.

రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసినా, అక్రమంగా తరలించినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.కార్డుదారుల నుండి రేషన్ దుకాణదారులు బియ్యం కొనుగోలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇప్పటినుంచి అన్ని రేషన్ దుకాణాలను ప్రతిరోజు తనిఖీలు చేస్తామని చెప్పారు.

రేషన్ బియ్యం సక్రమంగా కార్డుదారులకు అందించాలని సూచించారు.విధిగా ప్రతిరోజు రేషన్ దుకాణాలు తెరిచి సరుకులు పంపిణీ చేయాలని కోరారు.

ఆయన వెంట సివిల్ సప్లై ఆర్ఐ సురేందర్ సింగ్ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube