రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే చర్యలు తప్పవు -సివిల్ సప్లై డిటి రామకృష్ణారెడ్డి

నల్లగొండ జిల్లా:రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లై డిప్యూటీ తాహాసిల్దార్ రామకృష్ణారెడ్డి హెచ్చరించారు.

శుక్రవారం రేషన్ దుకాణాల తనిఖీలో భాగంగా మిర్యాలగూడ పట్టణం షాబునగర్ లోని షాప్ నెంబర్ 5 ను ఆకస్మికంగా తనిఖీ చేసి బియ్యం నిల్వలను పరిశీలించారు.

దుకాణం నందు 15 క్వింటాళ్ల 25 కిలోల బియ్యం తక్కువగా ఉండడంతో షాపు నిర్వాహకుడు గంధం శ్రీనివాస్ పై 6ఏ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

షాపులో మిగిలిన నిల్వలను పక్కనే ఉన్న మరో షాపు నెంబర్ 3 కు అప్పగించినట్లు చెప్పారు.

రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసినా, అక్రమంగా తరలించినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

కార్డుదారుల నుండి రేషన్ దుకాణదారులు బియ్యం కొనుగోలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇప్పటినుంచి అన్ని రేషన్ దుకాణాలను ప్రతిరోజు తనిఖీలు చేస్తామని చెప్పారు.

రేషన్ బియ్యం సక్రమంగా కార్డుదారులకు అందించాలని సూచించారు.విధిగా ప్రతిరోజు రేషన్ దుకాణాలు తెరిచి సరుకులు పంపిణీ చేయాలని కోరారు.

ఆయన వెంట సివిల్ సప్లై ఆర్ఐ సురేందర్ సింగ్ ఉన్నారు.

అశ్విన్‌ రిటైర్‌మెంట్‌పై భార్య ఎమోషనల్ పోస్ట్