సూర్యాపేట జిల్లా:జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలులలో ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే సత్వరమే నివృత్తి చేయుటకు కలెక్టరేట్ నందు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనట్లు జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ ఒక ప్రకటనలో తెలిపారు.కేంద్రాలలో సిబ్బంది,నిర్వాహకుల నుండి ధాన్యం కొనుగోలు విషయంలో ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే రైతులు వెంటనే కంట్రోల్ రూమ్ నెంబర్ 6281492368 కు ఫోన్ చేసి సత్వరమే సంబంధిత అధికారుల ద్వారా నివృత్తి చేసుకోవాలని సూచించారు.అలాగే కంట్రోల్ రూమ్ ప్రతి రోజు ఉదయం 9.00 గంటల నుండి రాత్రి 7.00 గంటల వరకు పనిచేస్తుందని రైతులు, కేంద్రాల నిర్వాహకులు ఇట్టి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.




Latest Suryapet News