డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు మీసేవ ద్వారా దరఖాస్తులు

యాదాద్రి జిల్లా:భువనగిరి డివిజన్లోని బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామంలో 30 ఇండ్లు, బీబీనగర్ గ్రామంలో 14 ఇండ్లు,చౌటుప్పల్ డివిజన్లోని పోచంపల్లి మండలం జుబ్లకపల్లి గ్రామంలో 36ఇండ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన రెండు పడకల గదుల ఇండ్ల కేటాయింపులకు అర్హత కలిగిన వారు మీసేవ ద్వారా ఈనెల 25వ తేదీ నుండి వచ్చే మే నెల 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు.ఈ గ్రామాలకు సంబంధించి మీసేవలో దరఖాస్తు చేసుకునేవారు ఆధార్ కార్డు కలిగియుండి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల వారు, ఆహార భద్రత కార్డు కలిగినవారు,ఇల్లులేని పేదవారు, గుడిసెలలో నివాసం కలవారు,అద్దెకు ఉన్న వారు అర్హులని ఆమె తెలిపారు.

 Applications For Double Bedroom Houses Through Your Service-TeluguStop.com

దరఖాస్తులను సంబంధిత నమునాలో పూర్తి వివరాలతో సంబంధిత ధృవపత్రాలు జతపరచి వచ్చే మే 9 వ తేదీలోగా మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని,ఇట్టి అవకాశాన్ని అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube