సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని 7 మండలాల్లో నాలుగు పశువైద్య సంచార వాహనాలు (1962) సంచరిస్తుంటాయని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకుని,పశు సంపద గణనీయంగా పెంచాలని జివికెఈఎంఆర్ఐ రాష్ట్ర ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ భగిష్ మిశ్రా అన్నారు.శుక్రవారం హుజూర్ నగర్ పట్టణంలోని పశుసంరక్షణ కార్యాలయంలో జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ నజీరుద్దీన్,ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ సోమేశ్వర్ ఆధ్వర్యంలో 1962 వాహన సంచార పశు వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ…పశుసంపదను పెంచితేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని,పశువులకు ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషిచేయాలని సంచార పశువైద్య సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో సంచార పశువైద్య సిబ్బంది డా.ప్రశాంత్,నజిర్,నగేష్,గోపి పాల్గొన్నారు.