సూర్యాపేట జిల్లా:చట్ట పరిధిలో పనిచేస్తూ శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన ప్రభుత్వ ఉద్యోగులైన పోలీసులను తమ చేతికింది సొంత పని మనుషులుగా అధికార పార్టీకి చెందిన పాలకులు వాడుకోవడం గర్హనీయమని సామాజిక ఉద్యమకారుడు కొల్లు వెంకటేశ్వరరావు ఆక్షేపించారు.గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ కోదాడ నియోజకవర్గంలో పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
ఇటీవల కోదాడలో జరిగిన అధికార పార్టీ సొంత ప్రైవేట్ కార్యక్రమమైన ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన ప్రజలు, కార్యకర్తలు మధ్యలోనే వెళ్లిపోకుండా ప్రభుత్వ ఉద్యోగులైన పోలీసులు ప్రహరీ గేట్లు మూసివేస్తూ కాపలా కాసిన తీరు శోచనీయమన్నారు.కోదాడలో నాలుగేండ్లలో నలుగురు పోలీస్ సర్కిల్ ఇన్స్ పెక్టర్లు బదిలీ కావడం కూడా బాధాకరమని,ఈ పరిస్థితి మారాలని హితవు పలికారు.