సమంత ధరించిన ఈ డైమండ్ నెక్లస్ ఖరీదెంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) ఏ పని చేసినా తన మార్క్ కచ్చితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.ఈ స్టార్ హీరోయిన్ ను అభిమానించే అభిమానుల సంఖ్య కూడా తక్కువేం కాదనే సంగతి తెలిసిందే.

 Shocking Facts About Samantha Diamond Necklace Details Here Goes Viral In Social-TeluguStop.com

శాకుంతలం( Shaakuntalam) సినిమా డిజాస్టర్ గా నిలిచినా ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా సమంత కెరీర్ పరంగా ముందడుగులు వేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

సమంత గ్లామర్ లుక్ లో కనిపించిన ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ కాగా సమంత మయోసైటిస్ నుంచి కోలుకున్నారని ఆమె లేటెస్ట్ లుక్స్ ను చూస్తే అర్థమవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.సమంత లేటెస్ట్ ఫోటోలలో ఆమె వేసుకున్న డైమండ్ నెక్లస్( Diamond Necklace ) ఖరీదు ఏకంగా 2.9 కోట్ల రూపాయలు అని సమాచారం.ఆమె ధరించిన బ్రాస్ లెట్ ఖరీదు మాత్రం ఏకంగా 2.6 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.

సమంత తన రెమ్యునరేషన్( Remuneration ) ను నగలు, బ్రాస్ లేట్ల కోసం ఖర్చు చేస్తుందా? అని కొంతమంది అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.సమంత ధరించిన డ్రెస్ ఖరీదు దాదాపుగా 80,000 రూపాయలు అని సమాచారం అందుతోంది.ప్రస్తుతం ఖుషి, సిటాడెల్( Citadel ) ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సమంత ఈ రెండు ప్రాజెక్ట్ లతో విజయాలను అందుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారని బోగట్టా.

5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్న సమంత కథల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.పౌరాణిక సినిమాలకు దూరంగా ఉండాలని ఆమె ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతోంది.కథ నచ్చితే బోల్డ్ రోల్స్ లో కనిపించడానికి కూడా సమంత గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న సంగతి తెలిసిందే.

సమంతకు క్రేజ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube