సూర్యాపేట జిల్లా:తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్-1, గ్రూప్-2,గ్రూప్-3,ఇతర అన్నిరకాల పోటీ పరీక్షల ఫలితాలను నిలుపుదల చేయాలని ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షకు బుధవారం
హుజూర్ నగర్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్ సంఘీభావం తెలిపారు.ఎమ్మార్పీఎస్ చేస్తున్న పోరాటంలో న్యాయం ఉందని, కాంగ్రెస్ సర్కార్ మాదిగలకు మాట ఇచ్చి మోసం చేస్తుందని అన్నారు.







