సూర్యాపేట జిల్లా:జిల్లాలోని మున్సిపల్ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.శుక్రవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో చేపట్టిన పలు అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలటీలలో గుర్తించిన బస్తి దవాఖానాలలో మౌలిక వసతులు కల్పించి అందుబాటులోకి తేవాలని అలాగే ఒక అంగన్వాడీ కేంద్రాన్ని మోడల్ అంగన్వాడీ కేంద్రంగా అన్ని హంగులతో తీర్చిదిద్దాలని తెలిపారు.అలాగే ఇచ్చిన టార్గెట్ ప్రకారంగా హరితహారం నూరుశాతం పూర్తచేయలని,అన్ని నర్సరీలలో అన్ని రకాల మొక్కలు పెంచాలని సూచించారు.
పెండింగులో ఉన్న వైకుంఠ దామాల పనులను సత్వరమే చేపట్టి మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు.పట్టణ ప్రగతి కింద చేపట్టిన పనులను పూర్తి చేసి ఆయా బిల్లులను సత్వరమే చెల్లించాలని ఆదేశించారు.
మెప్మా ద్వారా అన్ని మున్సిపాలిటీలలో మహిళ సంఘాలకు సకాలంలో రుణాలు అందించాలని ఆదేశించారు.ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన వెజ్,నాన్ వెజ్ మార్కెట్ల పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు సూర్యాపేట సత్యనారాయణరెడ్డి,కోదాడ మహేశ్వరరెడ్డి,హుజూర్ నగర్ శ్రీనివాస రెడ్డి,నేరేడుచర్ల వెంకటేశ్వర్లు,తిరుమలగిరి డి.శ్రీను,పి.డి మెప్మా రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.