సూర్యాపేట జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తులకు ఆధార్ కార్డు తప్పనిసరి చేయడంతో ఇప్పటి వరకు ఆధార్ కార్డు లేనివారు,ఆధార్ లో చేర్పులు మార్పులు చేసుకునే వారు ఆధార్ సెంటర్స్ క్యూ కడుతున్నారు.జిల్లా కేంద్రంలోని ఇందిరా పార్క్ వద్ద గల ఆధార్ సెంటర్ కు ఆధార్ లో మార్పులకు ప్రజలు ఉదయం ఐదు గంటల నుండి అధిక సంఖ్యలో బారులు తీరుతున్నారు.
ఆధార్ సెంటర్ కు ఒకేసారి భారీగా జనం తరలిరావడంతో ఆధార్ నిర్వాహకులు ఇబ్బందులకు గురవుతున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజలకు ఆధార్ వినియోగంపై సరైన అవగాహన కల్పించాలని, లేకుంటే ఏం చేయాలో అర్థంకాక అవసరం ఉన్నా లేకున్నా ఆధార్ సెంటర్ కి వస్తున్నారని పలువురు వాపోతున్నారు.